

టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారీ షాక్ తగలనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందే అతడిని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచిన సూర్య, గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడి వరుస వైఫల్యాలు సెలెక్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో కూడా సూర్యకుమార్ ప్రదర్శన నిరాశపరిచింది. ముంబై ఇండియన్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన అతడు, 2017 తర్వాత అత్యంత పేలవమైన సీజన్‌ను నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లతో బీసీసీఐ చర్చలు జరిపినట్లు సమాచారం. కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తుండగా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!