26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

Writer: Shivani K 08:13 AM, 26 అక్టోబర్, 2026
టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఫార్మాట్‌లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా భారత్ ఈ మైలురాయిని అందుకుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 300వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఇప్పటివరకు 300 మ్యాచ్‌లు ఆడిన భారత్ 200 విజయాలు సాధించగా, 83 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో ఏడు మ్యాచ్‌లు టైగా ముగియగా, 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, 176 విజయాలతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 135, దక్షిణాఫ్రికా 129, ఇంగ్లండ్ 128, ఆస్ట్రేలియా 127 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఆదుకున్నారు. తిలక్ 26 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలవగా, నితీశ్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఏడో వికెట్‌కు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీ భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో టీమిండియా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026.. నవంబర్ 22న భారత్-పాక్ పోరు!

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026.. నవంబర్ 22న భారత్-పాక్ పోరు!

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! యువతకు ధోనీ కీలక సూచన

ఫోన్ పక్కన పెట్టండి.. మైదానంలోకి రండి! యువతకు ధోనీ కీలక సూచన

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు.. తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు

ఏషియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ షెడ్యూల్‌ విడుదల
ట్యాగ్లు
టీమిండియాభారత క్రికెట్ జట్టుఅంతర్జాతీయ టీ20 క్రికెట్భారత్ 200 విజయాలుభారత్ వర్సెస్ న్యూజిలాండ్తిలక్ వర్మనితీశ్ కుమార్ రెడ్డిటీ20 రికార్డులుటీమిండియా విజయంన్యూజిలాండ్ టీ20 సిరీస్

ఏషియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ షెడ్యూల్‌ విడుదల

ధోనీ ఐపీఎల్‌ 2027 ప్రయాణంపై వీడని సస్పెన్స్‌

ధోనీ ఐపీఎల్‌ 2027 ప్రయాణంపై వీడని సస్పెన్స్‌

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో స్వర్గపురి రికార్డులను పరిశీలించిన సీబీఐ
జనరల్

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో స్వర్గపురి రికార్డులను పరిశీలించిన సీబీఐ

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కృష్ణ దాస్ కీర్తనల్లో అనుష్క, విరాట్ సందడి.. వైరల్‌గా మారిన ఫొటోలు
జనరల్

కృష్ణ దాస్ కీర్తనల్లో అనుష్క, విరాట్ సందడి.. వైరల్‌గా మారిన ఫొటోలు

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా
క్రీడలు

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

ఏపీకి అర్నాబ్ తుఫాన్ ముప్పు.. పలు జిల్లాలకు ఎరుపు హెచ్చరిక
జనరల్

ఏపీకి అర్నాబ్ తుఫాన్ ముప్పు.. పలు జిల్లాలకు ఎరుపు హెచ్చరిక

నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
జనరల్

నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

తుఫాన్‌ ప్రభావం.. పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌
జనరల్

తుఫాన్‌ ప్రభావం.. పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌

అల్లం తులసి టీతో జలుబు, దగ్గు తగ్గుతాయా? వైద్యులు సూచిస్తున్న విషయాలు తెలుసుకోండి
ఆరోగ్యం

అల్లం తులసి టీతో జలుబు, దగ్గు తగ్గుతాయా? వైద్యులు సూచిస్తున్న విషయాలు తెలుసుకోండి

చల్లటి నీటితో తలస్నానం చేస్తే జలుబు వస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

చల్లటి నీటితో తలస్నానం చేస్తే జలుబు వస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే!

ఐసెన్‌కోట్‌ వర్సెస్‌ నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ ప్రధాని పీఠంపై ఆసక్తికర పోరు
జనరల్

ఐసెన్‌కోట్‌ వర్సెస్‌ నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ ప్రధాని పీఠంపై ఆసక్తికర పోరు

జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రభుత్వానికి అతి విధేయత చూపేవారు.. సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రభుత్వానికి అతి విధేయత చూపేవారు.. సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన వ్యాఖ్యలు

క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా
రాజకీయాలు

క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!