

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ ఆర్యనా సబలెంకా పోరాట విజయంతో సెమీఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ఆరో సీడ్ లిండా నోస్కోవాపై 7-6 (7-1), 3-6, 7-6 (10-7)తో గెలిచింది. సబలెంకా 12 ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టింది. నిర్ణయాత్మక సెట్లో 2-4తో వెనుకబడిన ఆమె 4-4తో స్కోరు సమం చేసి టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ ఎలెనా రిబకినా 6-1, 6-4తో 13వ సీడ్ నవోమి ఒసాకాను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. నాలుగో సీడ్ కోకో గాఫ్ కూడా 6-1, 6-4తో జోవిచ్ను ఓడించి తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది.
పురుషుల సింగిల్స్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో ఇటలీకి చెందిన దర్దేరిపై 6-2, 6-2, 7-6 (7-3)తో విజయం సాధించాడు. జ్వెరెవ్ 13 ఏస్‌లు, 43 విన్నర్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో రష్యా ఆటగాడు కరెన్ ఖచనోవ్ 14వ సీడ్ లెర్నర్ టీన్ను ఐదు సెట్ల పోరులో ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. ఖచనోవ్ 9 ఏస్‌లు, 48 విన్నర్లతో రాణించాడు. డేవిడ్ గోఫిన్ సెరుండోలోను 6-3, 4-6, 7-5, 7-5తో ఓడించగా.. జెస్పర్ డి జోంగ్ ఫ్రాన్స్‌కు చెందిన జియార్డ్పై ఐదు సెట్ల పోరులో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!