
జనరల్

లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ఆయన స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాలుగా మారనుంది. జట్టు తదుపరి కెప్టెన్ ఎంపికపై ఇప్పటికే చర్చ సాగుతుండగా, క్రిస్టియన్ రొమిరో, గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్, మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మాక్ అలిస్టర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురూ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లే కావడంతో కెప్టెన్సీ రేసుపై ఆసక్తి పెరిగింది.
అయితే ఈ ముగ్గురిలో కోచ్ లియోనెల్ స్కలోనీకి సన్నిహితుడిగా పేరున్న డిఫెండర్ క్రిస్టియన్ రొమిరోకే కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెస్సీ తర్వాత జట్టును నడిపించే ఆటగాడి ఎంపిక అర్జెంటీనా భవిష్యత్ జట్టు వ్యూహంలో కీలకంగా మారనుంది. దీనిపై అధికారిక నిర్ణయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!