
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ప్రధానంగా ఎదురవుతున్న ఛార్జింగ్ సమయ సమస్యకు పరిష్కారం చూపే దిశగా BYD కొత్త Flash Charge టెక్నాలజీని తీసుకొచ్చింది. రెండో తరం Blade Batteryతో పనిచేసే ఈ టెక్నాలజీ ద్వారా సాధారణ EV ఛార్జింగ్ విధానాలతో పోలిస్తే చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. 10 శాతం నుంచి 97 శాతం వరకు కేవలం సుమారు తొమ్మిది నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని పేర్కొంది.
అంతేకాకుండా ఐదు నిమిషాల్లోనే బ్యాటరీ 70 శాతం వరకు ఛార్జ్ అవుతుందని BYD చెబుతోంది. ఈ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దూర ప్రయాణాల్లో EV వినియోగదారులకు సమయం ఆదా కావడంతో పాటు ఛార్జింగ్‌పై ఉన్న ఆందోళన కూడా తగ్గే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ విస్తృతంగా అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!