

యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా కొత్త ఐఫోన్ శ్రేణి విడుదలవుతుందంటే సాంకేతికతను ఇష్టపడేవారిలో ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 శ్రేణిపై అంచనాలు నెలకొన్న వేళ.. యాపిల్ చరిత్ర, లోగో, ‘ఐ’ అక్షరానికి ఉన్న అర్థం, సహ వ్యవస్థాపకుడు రానాల్డ్ వేన్, ఉత్పత్తుల ప్రకటనల్లో కనిపించే 9:41 సమయం వంటి ఆసక్తికర విషయాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. యాపిల్ తొలి చిహ్నాన్ని రానాల్డ్ వేన్ రూపొందించారు. అందులో యాపిల్ చెట్టు కింద కూర్చున్న ఐజాక్ న్యూటన్ చిత్రం ఉండేది. ఆ తర్వాత ప్రస్తుతం కనిపించే కొరికిన యాపిల్ చిహ్నాన్ని రాబ్ జానోఫ్ రూపొందించారు. అలాగే ‘ఐ’ అనే అక్షరం అంతర్జాలం, వ్యక్తిగతం, బోధన, సమాచారం, స్ఫూర్తి అనే ఐదు అంశాలకు ప్రతీకగా ఉంటుందని స్టీవ్ జాబ్స్ వివరించారు.
స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌తో పాటు రానాల్డ్ వేన్ కూడా యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అయితే సంస్థ ప్రారంభమైన కొద్దిరోజులకే తన వాటాను విక్రయించి ఆయన బయటకు వెళ్లిపోయారు. యాపిల్ తన ఎక్స్ ఖాతాలో ఉత్పత్తులు, కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారాలను ప్రత్యేకమైన దాచిన పోస్టుల రూపంలో చేయడం కూడా విశేషమే. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ప్రకటనల్లో ఉదయం 9:41 సమయం కనిపించడం వెనుక తొలి ఐఫోన్ ఆవిష్కరణకు సంబంధించిన కారణం ఉంది. 2010లో స్వతంత్ర అనువర్తనంగా ఉన్న సిరిని యాపిల్ కొనుగోలు చేసి ఐఫోన్లో భాగం చేసింది. అలాగే ఐప్యాడ్ విడుదలైన దాదాపు 14 ఏళ్ల వరకు అందులో గణక యంత్రం అనువర్తనం లేకపోవడం కూడా ఆసక్తికరమైన విషయమే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!