

గూగుల్ విండోస్ పీసీల కోసం ప్రత్యేక జెమిని యాప్‌ను గురువారం లాంచ్ చేసింది. బ్రౌజర్‌లో ప్రత్యేక ట్యాబ్‌ను ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం లేకుండా నేరుగా డెస్క్‌టాప్ నుంచే జెమిని ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకునేలా ఈ యాప్‌ను రూపొందించింది. ఇతర యాప్స్‌లో పని చేస్తున్న సమయంలోనూ జెమినిని యాక్సెస్ చేయవచ్చు. Alt + Space కీబోర్డ్ షార్ట్‌కట్‌ను నొక్కితే యాక్టివ్ యాప్‌పైనే జెమిని ఓపెన్ అవుతుంది. దీంతో డాక్యుమెంట్లలోని సమాచారాన్ని చెక్ చేయడం, ప్రశ్నలు అడగడం, కొత్త ఆలోచనలు పొందడం వంటి పనులను సులభంగా చేయవచ్చు.
మరింత క్లిష్టమైన పనుల కోసం ప్రత్యేక వర్క్‌స్పేస్‌ను కూడా గూగుల్ అందించింది. ఇందులో మల్టీ-స్టెప్ టాస్క్‌లను నిర్వహించగల Gemini Spark ఏఐ ఏజెంట్‌కు యాక్సెస్ ఉంటుంది. Gmail, Google Drive వంటి గూగుల్ యాప్స్‌ను జెమినితో కనెక్ట్ చేసుకుని వాటిలోని సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు వివిధ గూగుల్ యాప్స్‌లో ఉన్న సమాచారంతో ప్రాజెక్ట్ సమ్మరీని రూపొందించమని జెమినిని అడగవచ్చు. దీంతో పాటు Nano Banana ద్వారా ఇమేజ్‌లు, Gemini Omni ద్వారా వీడియోలను రూపొందించే సదుపాయం కూడా విండోస్ యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ Windows 10, Windows 11 పీసీలకు అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో మరిన్ని డెస్క్‌టాప్ ఫీచర్లను తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!