4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

Writer: Nithish 07:08 AM, 4 సెప్టెంబర్, 2026
రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను రోజువారీ పనుల్లో సమర్థంగా వినియోగించడంలో భారత్‌ ప్రపంచంలోనే ముందంజలో ఉంది. మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసిన ‘వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ 2026’ నివేదిక ప్రకారం.. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, బ్రెజిల్‌ సహా 10 ప్రధాన మార్కెట్లలో భారత్‌లోనే అత్యధిక స్థాయిలో ఏఐ ఆధారిత నిపుణుల వినియోగం నమోదైంది. దేశంలోని ఏఐ వినియోగదారుల్లో 32 శాతం మంది సంక్లిష్టమైన బహుళ దశల పనుల్లో ఏఐ సహాయకులను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 16 శాతంతో పోలిస్తే రెట్టింపు. గతేడాదితో పోలిస్తే ఏఐ సాయంతో గతంలో చేయలేని పనులను కూడా సులభంగా చేయగలుగుతున్నామని 78 శాతం మంది భారతీయులు తెలిపారు.

ఏఐ అందించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా మానవ పర్యవేక్షణకు భారత నిపుణులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 63 శాతం మంది నాణ్యత నియంత్రణకు, 59 శాతం మంది విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు, 87 శాతం మంది తుది నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉందని, ఏఐ ఫలితాలను తుది నిర్ణయంగా కాకుండా ప్రారంభ బిందువుగా మాత్రమే చూస్తున్నామని వెల్లడించారు. దేశీయ ఐటీ సంస్థల్లోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు ఆరు నెలల్లోనే కలిపి 4 లక్షలకు పైగా మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్‌ లైసెన్సులను పొందాయి. విప్రో ఉద్యోగులు 29 వేలకు పైగా ఏఐ సహాయకులను అభివృద్ధి చేయగా, టీసీఎస్‌లో ఏఐ వినియోగంతో పరిశోధన, కంటెంట్‌ విభాగాల్లో ఉత్పాదకత 20–25 శాతం పెరిగినట్లు సంస్థ గుర్తించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

ట్యాగ్లు
కృత్రిమ మేధఏఐ సాంకేతికతభారత్‌మైక్రోసాఫ్ట్‌వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ఏఐ ఏజెంట్లుఐటీ రంగండిజిటల్‌ సాంకేతికతకోపైలట్‌సాంకేతిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!