

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ, ఎఫ్70ఈ 5జీ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ తాజాగా మరో ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-యూ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ ఉన్నాయి. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 ఎంపీ కెమెరాను అందించారు. 5,000mAh బ్యాటరీకి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. అక్టోబర్ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ప్రారంభ ధర రూ.17,999కు అందుబాటులో ఉంటుందని సమాచారం. బోల్డ్ బ్లాక్, వివిడ్ వైలెట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!