
జనరల్

యాపిల్ సంస్థ సీఈఓగా దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించిన టిమ్ కుక్ నేటితో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. యాపిల్ అధికారిక ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 1, 2026 నుంచి సంస్థ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ సంస్థలోని కొన్ని ముఖ్యమైన అంశాల్లో తన సేవలను అందించనున్నారు.
2011లో స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన టిమ్ కుక్ సంస్థను గణనీయంగా విస్తరించారు. ఆయన నాయకత్వంలో యాపిల్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. కుక్ బాధ్యతలు చేపట్టే సమయంలో 400 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్న సంస్థ విలువ దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి ఉత్పత్తులతో పాటు సర్వీసెస్ వ్యాపారాన్ని కూడా ఆయన విస్తరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!