

అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,250గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,33,140గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,930గా ఉంది.
వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో రూ.2,49,900గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో ఈ స్వల్ప మార్పు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంగా నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో బంగారం ధరలు ఒకే స్థాయిలో ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో మాత్రం స్వల్ప ధరల తేడాలు కనిపిస్తున్నాయి.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!