

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా పెరిగిన పసిడి ధరలు మళ్లీ కాస్త దిగివచ్చాయి. ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,940గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,940, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,950గా ఉంది.
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,850గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,090గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో రూ.1,43,940గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశీయ డిమాండ్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!