19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాపిటల్‌ మార్కెట్లలోకి అడుగుపెట్టనున్న మరో రెండు కంపెనీలు

Writer: Pooja 09:58 AM, 18 నవంబర్, 2026
క్యాపిటల్‌ మార్కెట్లలోకి అడుగుపెట్టనున్న మరో రెండు కంపెనీలు

ఇటీవల సెకండరీ మార్కెట్లు పుంజుకోవడంతో ప్రైమరీ మార్కెట్లకు కూడా ఊతం లభిస్తోంది. దీంతో మరిన్ని కంపెనీలు స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రెండు సంస్థలు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్‌డేటెడ్, ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇంటర్నెట్‌ సేవల సంస్థ రెడిఫ్‌.కామ్‌ ఇండియా, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేవల సంస్థ మెగానెట్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.

రెడిఫ్‌.కామ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించిన నిధుల్లో రూ. 225 కోట్లను పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. రెడిఫ్‌ వన్, రెడిఫ్‌ పే, రెడిఫ్‌ టీవీ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి, విస్తరణకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. మరో రూ. 183 కోట్లను మార్కెటింగ్, బ్రాండింగ్‌ కార్యకలాపాలకు కేటాయించనుంది. మిగిలిన మొత్తాన్ని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. అవెన్యూస్‌ఏఐ లిమిటెడ్‌ (గతంలో ఇన్‌ఫీబీమ్‌ అవెన్యూస్‌) అనుబంధ సంస్థ అయిన రెడిఫ్‌.కామ్‌ ఇండియా 1996లో ప్రారంభమైంది. తొలుత ఇంటర్నెట్‌ పోర్టల్, డిజిటల్‌ మీడియా సంస్థగా సేవలు అందించిన ఈ కంపెనీ, తర్వాత ఈమెయిల్, డిజిటల్‌ చెల్లింపులు, ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్, మొబైల్‌ అప్లికేషన్లు, ఈ-కామర్స్‌ రంగాల్లోకి విస్తరించింది. 2025 జూలైలో రెడిఫ్‌ టీవీని ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్‌పీసీఐ అనుమతి అనంతరం రెడిఫ్‌ పే సేవలను అందుబాటులోకి తెచ్చింది. గోప్యమైన దాఖలు విధానంలో ఆగస్టులో సెబీ అనుమతి పొందిన సంస్థ తాజాగా అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది.

మరోవైపు, మెగానెట్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ఐపీఓ ద్వారా రూ. 740 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. ఇందులో రూ. 140 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతోపాటు, ప్రమోటర్లు రూ. 600 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ జారీ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 100 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 11 కోట్లను రుణాల చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ ఏఐ సర్వర్లు, వర్క్‌స్టేషన్లు, డేటా సెంటర్‌ పరిష్కారాలు, హైఎండ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్, స్టోరేజీ సొల్యూషన్లు, సాఫ్ట్‌వేర్‌ సేవలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2,600కు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తున్న ఈ సంస్థకు నవీముంబైలోని మహాపేలో సర్వర్ల తయారీ కేంద్రం ఉంది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5,928 సర్వర్లు కాగా, 2025–26లో 2,621 సర్వర్లను తయారు చేసింది. అదే ఆర్థిక సంవత్సరంలో రూ. 447 కోట్ల ఆదాయం, రూ. 38 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది రూ. 368 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఫ్రాస్ట్‌ అండ్‌ సల్లివాన్‌ నివేదిక ప్రకారం, ప్రస్తుతం రూ. 45,510 కోట్లుగా ఉన్న దేశీయ ఏఐ సర్వర్ల మార్కెట్‌ 2032 నాటికి రూ. 1,82,820 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఈ రంగం ఏటా 26 శాతం వృద్ధి సాధించే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో హోండా రెబల్‌ 500 విడుదల..

భారత్‌లో హోండా రెబల్‌ 500 విడుదల..

వాహనదారులకు కేంద్రం ఊరట.. పీయూసీసీ చెల్లుబాటు గడువులో కీలక మార్పులు

వాహనదారులకు కేంద్రం ఊరట.. పీయూసీసీ చెల్లుబాటు గడువులో కీలక మార్పులు

స్టాక్ మార్కెట్లలో లాభాల హ్యాట్రిక్.. వరుసగా మూడో వారం కూడా జోరు

స్టాక్ మార్కెట్లలో లాభాల హ్యాట్రిక్.. వరుసగా మూడో వారం కూడా జోరు

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ డబ్బులు విడతలవారీగా విత్‌డ్రా చేసుకునే అవకాశం...

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ డబ్బులు విడతలవారీగా విత్‌డ్రా చేసుకునే అవకాశం...

ఆంథ్రోపిక్ ఐపీవోతో 4,250 మంది ఉద్యోగులు కోటీశ్వరులు..

ఆంథ్రోపిక్ ఐపీవోతో 4,250 మంది ఉద్యోగులు కోటీశ్వరులు..

భారత్‌లో స్వచ్ఛమైన ఇంధనం కోసం అమెజాన్ భారీ పెట్టుబడులు

భారత్‌లో స్వచ్ఛమైన ఇంధనం కోసం అమెజాన్ భారీ పెట్టుబడులు

ట్యాగ్లు
రెడిఫ్ ఐపీఓమెగానెట్ టెక్నాలజీస్ఐపీఓ వార్తలుస్టాక్ మార్కెట్ఏఐ సర్వర్లుభారతీయ మార్కెట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!