
జనరల్

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం కూడా లాభాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు కలిసివచ్చాయి. తాజా ట్రేడింగ్లో సెన్సెక్స్ 564 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 113 పాయింట్లు పెరిగింది. దీంతో మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) భారీగా కొనుగోళ్లు చేపట్టారు. ఈ క్రమంలో రూ.33,342 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లు పెరిగింది. అయితే ఐటీ రంగ షేర్లలో నష్టాలు, రూపాయి విలువ క్షీణించడం మార్కెట్లపై కొంత ఒత్తిడి తీసుకొచ్చాయి. అయినప్పటికీ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల బాటలో కొనసాగాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!