
జనరల్

ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోయినా, ప్రాగ్యా జైస్వాల్ రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హిందీ చిత్రం ‘సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, తెలుగు చిత్రం ‘టైసన్ నాయుడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉంటే, రోజ్ గోల్డ్ మిర్రర్ వర్క్ డ్రెస్‌లో ప్రాగ్యా మెరిసిపోయారు. స్ట్రాప్‌లెస్ స్వీట్హార్ట్ నెక్ బ్లౌజ్, ఫిష్‌టైల్ స్కర్ట్, మెడ చుట్టూ అందంగా అమర్చిన షీర్ డ్రేప్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చాంద్‌బాలీ చెవిపోగులు, గోల్డ్ రింగ్, వేవీ హెయిర్ స్టైల్‌తో ఆమె అందం మరింత ఇనుమడించింది. గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ అందాల భామకు రాబోయే రెండు చిత్రాలైనా విజయాన్ని అందిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!