27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

Writer: Harika S 04:23 PM, 27 నవంబర్, 2026
డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర మూడో రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మైత్రీవనం వద్ద కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి పాల్గొని తన సంపూర్ణ మద్దతు తెలిపారు. స్థానికులు, పాఠశాల విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. భావితరాలకు అందించగలిగే గొప్ప ఆస్తి డ్రగ్స్ రహిత సమాజమేనని ఆమె పేర్కొన్నారు.

పాదయాత్రలో కీర్తిరెడ్డి డప్పు వాయిస్తూ, స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశ యువతే దేశానికి గొప్ప సంపదని, వారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని విదేశీ శక్తులు డ్రగ్స్‌కు అలవాటు చేసే కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాను అరికట్టేందుకు ప్రజలందరూ తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకుల ప్రయత్నాలతో మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యం కాదని, సమిష్టి కృషి అవసరమని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం చేపట్టిన పలు కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ, డ్రగ్స్ నిర్మూలన లక్ష్యాన్ని కూడా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నషా ముక్త్ భారత్ విజన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

ట్యాగ్లు
జూటూరు కీర్తిరెడ్డినషా ముక్త్ భారత్కిషన్ రెడ్డితెలంగాణ బీజేపీడ్రగ్స్ రహిత భారత్హైదరాబాద్ పాదయాత్రడ్రగ్స్ అవగాహన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!