19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినీ నటి గోగినేని అనితకు టోకరా

Writer: Pooja 04:52 PM, 18 నవంబర్, 2026
 సినీ నటి గోగినేని అనితకు టోకరా

బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు తక్కువ ధరకు బుక్ చేస్తామంటూ నమ్మించిన సైబర్ మోసగాళ్లు సినీ నటి గోగినేని అనితను రూ.4,14,180 మేర మోసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో నివసించే అనిత.. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతికారు. అప్పుడు ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంస్థకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్న రాజేష్ ఆమెను సంప్రదించాడు. తమ వద్ద బిజినెస్ క్లాస్ టికెట్లు తక్కువ ధరకు లభిస్తాయని నమ్మించి, వాషింగ్టన్ ప్రయాణానికి రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. టికెట్ బుకింగ్ కోసం డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరాడు.

అతడి మాటలను నమ్మిన అనిత.. తన డెబిట్ కార్డు వివరాలతో పాటు, టికెట్ బుకింగ్ కోసమేనని భావించి ఓటీపీని కూడా వెల్లడించారు. కొద్దిసేపటికే ఆమె బ్యాంకు ఖాతా నుంచి ‘క్లియర్ ట్రిప్’ పేరుతో రూ.4,14,180 డెబిట్ అయ్యాయి. అయితే డబ్బులు కట్ అయినప్పటికీ విమాన టికెట్ బుకింగ్‌కు సంబంధించిన నిర్ధారణ సమాచారం గానీ, ఈ-టికెట్ గానీ అందలేదు. దీంతో అనుమానం వచ్చిన అనిత తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

ట్యాగ్లు
సైబర్ నేరాలుఆన్‌లైన్ మోసంగోగినేని అనితవిమాన టికెట్ మోసంహైదరాబాద్ వార్తలుపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!