

మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే అన్ని విమాన సర్వీసులను 2026 నవంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జెడ్డా, మదీనా, రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులపై ప్రభావం పడనుంది. ప్రాంతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆయా నగరాలకు ప్రయాణించాలనుకునే వారు తమ విమాన వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించింది.
విమానాలు రద్దైన ప్రయాణికులకు వారు నమోదు చేసుకున్న సంప్రదింపు వివరాల ద్వారా సమాచారం అందిస్తున్నామని ఇండిగో తెలిపింది. బాధిత ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రాంతీయ పరిణామాలను సంస్థ నిశితంగా పరిశీలిస్తోందని, పరిస్థితులకు అనుగుణంగా తదుపరి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతే తమకు అత్యంత ముఖ్యమని ఇండిగో మరోసారి పేర్కొంది. విమాన సర్వీసుల తాజా సమాచారం కోసం ప్రయాణికులు సంస్థ అధికారిక ప్రకటనలను అనుసరించాలని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!