
జనరల్

అక్వాన్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ముందస్తు చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 46 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వీటితో పాటు 46 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. తుఫాన్ పరిస్థితులను 24 గంటల పాటు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!