

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థుల వార్షిక కనీస ఫీజును రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (అపెక్మా) హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఫీజుల పెంపు దోహదపడుతుందని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో కొత్త బ్లాక్ పీరియడ్‌ను పూర్తి చేసి తదుపరి ఫీజుల ఖరారు ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రతి నెలా రూ.400 కోట్ల చొప్పున విడుదల చేయాలని అపెక్మా ప్రభుత్వాన్ని కోరింది. నిధుల విడుదలలో జాప్యం వల్ల కళాశాలల నిర్వహణపై ప్రభావం పడుతోందని పేర్కొంది. విద్యార్థుల సర్టిఫికెట్లను ఫీజుల బకాయిల పేరుతో నిలిపివేయవద్దని కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!