

రోడ్డు ప్రమాదాల్లో తమ తప్పు లేదని తేలిన డ్రైవర్లకు ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వాటిని పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించి జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయాలని ఈడీలు, డీపీటీవోలు, డిపో మేనేజర్లు, యూనిట్ అధికారులకు సూచించారు.
ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన డ్రైవర్ల లైసెన్స్‌లను పునరుద్ధరించేలా సంబంధిత డిపో మేనేజర్లు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్టీవోలు), ఇతర అధికారులకు లేఖలు కూడా రాసింది. లైసెన్స్‌లు తిరిగి వచ్చే వరకు సదరు డ్రైవర్లకు సాధారణ డ్రైవింగ్ విధులకు బదులుగా ఇతర పనులను తాత్కాలికంగా కేటాయించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రమాదాల్లో తప్పు లేదని తేలిన డ్రైవర్లకు లైసెన్స్ సస్పెన్షన్ సమయంలోనూ జీతాల భద్రత లభించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!