
జనరల్

పంజాబ్‌లో గురువారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పటియాలా-సంగ్రూర్ బైపాస్ సమీపంలోని భాక్రా కెనాల్‌పై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో వంతెనపై నుంచి రెండు ట్రక్కులు ప్రయాణిస్తుండటంతో అవి శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఒక ట్రక్కులో మంటలు చెలరేగడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. మరోవైపు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య, ఆస్తి నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!