

శంలోని విమానాశ్రయాల్లో విధులు నిర్వహిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సంఖ్యను తగ్గించి, కొన్ని బాధ్యతలను ప్రైవేటు భద్రతా సిబ్బందికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాల్లో సుమారు 55 వేల మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయాల కేటగిరీని బట్టి ప్రతి షిఫ్టులో 30 నుంచి 60 మంది వరకు సిబ్బందిని తగ్గించే అవకాశం ఉంది.
సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకానికి అయ్యే అధిక వ్యయాన్ని తగ్గించేందుకు ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని విమానాశ్రయ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విధుల్లోకి తీసుకునే ముందు ప్రైవేటు గార్డులకు తగిన శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. విమానాశ్రయ విధుల నుంచి తప్పించే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోరని, వారిని ఇతర యూనిట్లకు బదిలీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!