1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

Writer: Chandrika 11:32 PM, 31 ఆగస్టు, 2026
వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అనేక విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని సీఎం ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ నదిపై మూసారాంబాగ్‌ వద్ద నిర్మించిన కొత్త హైలెవల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని క్రమంగా గాడిలోకి తీసుకొచ్చామని చెప్పారు. 2024 జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్‌ ప్రయోజనాల్లో రూ.6 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల్లో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.

రైతు సంక్షేమం కోసం భారీగా నిధులు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రంగంలో 2 వేల పడకలతో ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ TIMS ఆసుపత్రులకు ప్రముఖ తెలంగాణ నాయకుల పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, దాదాపు శతాబ్దం తర్వాత కులగణన నిర్వహించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌, తెలంగాణ అభివృద్ధిని మూడు ఆర్థిక ప్రాంతాలుగా ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని వివరించారు. ORRలోపు కోర్‌ అర్బన్‌ రీజియన్‌, ORR నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య పెరీ అర్బన్‌ రీజియన్‌, RRR అవతల రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌గా విభజించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించి ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంవెయ్యి రోజుల పాలనతెలంగాణ అభివృద్ధితెలంగాణ సంక్షేమంరైతు సంక్షేమంమహిళా సంక్షేమంప్రభుత్వ ఉద్యోగాలుకులగణనఎస్సీ వర్గీకరణహైదరాబాద్‌ అభివృద్ధిమూసారాంబాగ్‌ వంతెన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌
రాజకీయాలు

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...
జనరల్

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆరోగ్యం

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..
జనరల్

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..
జనరల్

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..
జనరల్

మణిపూర్‌లో జనగణన వాయిదా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!