

ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్త సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ బిల్లు అమల్లోకి వస్తే భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ఆరోపించారు. నియోజకవర్గాల సరిహద్దులను అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకుని దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం లేకపోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.
హర్ ఘర్ తిరంగా ప్రచారం ద్వారా సేకరించిన సమాచారాన్ని బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని సౌరవ్ దాస్ ఆరోపించారు. దేశ జనాభాలో సుమారు 60 శాతం మంది యువత ఉన్నప్పటికీ, పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం కేవలం 5 శాతానికే పరిమితమైందని తెలిపారు. యువతకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!