

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026 అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకావాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తెలంగాణలో యువ సినీ ప్రతిభను ప్రోత్సహించడం, నూతన దర్శకులు, చిత్ర నిర్మాతలకు ప్రోత్సాహం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. శనివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ముఖ్యమంత్రిని కలిసిన దిల్ రాజు వెంట సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, గాయకుడు నల్గొండ గద్దర్ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని యువ సినీ దర్శకులు, నూతన చిత్ర నిర్మాణ ప్రతిభకు గుర్తింపు లభించనుంది. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి, కొత్త తరం ఫిల్మ్ మేకర్స్కు అవకాశాలు కల్పించేందుకు ఈ అవార్డుల కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!