
జనరల్

ఇరాన్ తన కుమారులను హత్య చేయడానికి కుట్ర పన్నిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ విషయాన్ని నెలలుగా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. తన కుమారులు యాయిర్, అవ్నర్‌లో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు.
తన కుటుంబానికి షిన్ బెన్ ఇచ్చే భద్రత సరిపోదని, ప్రాణహానికి అవకాశం ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించాలని షిన్ బెన్ చీఫ్‌ను ఆయన కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!