
జనరల్

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ అబ్దుల్ మిషాల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన అతడిని ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అతడితో పాటు మరో నిందితుడు తారిఖ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కేరళకు చెందిన డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు.
మహేశ్వరం స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), ఇబ్రహీంపట్నం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. పక్కా సమాచారంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టి వారిని పట్టుకున్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన అబ్దుల్ మిషాల్ అరెస్ట్‌తో డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!