

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో, భారత్ పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) తొలిసారిగా నిర్వహించనున్న సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్ నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఎస్‌సీఓలోని పది సభ్య దేశాలనూ భారత్ ఆహ్వానించింది. పాకిస్థాన్ సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఆయన ఈ కార్యక్రమానికి హాజరైతే, భారత్‌లో పాకిస్థాన్‌కు చెందిన సీనియర్ మంత్రి పర్యటించడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి అవుతుంది.
ఈ సదస్సు ద్వారా ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర అవగాహనను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 20న తజికిస్థాన్‌లోని దుషాంబేలో జరిగిన ఎస్‌సీఓ ప్రభుత్వాధినేతల మండలి సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఫోరమ్ నిర్వహణపై ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 2025లో ఈ వేదిక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే, పాకిస్థాన్ ఈ ఆహ్వానంపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!