

చండీగఢ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సంజీవ్ కుమార్ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం రూ.27.97 లక్షలు ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయనకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ రూపంలో అందాయి. దీంతో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (CAT)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యూనల్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రాణాపాయ స్థితిలో అత్యవసర వైద్యం పొందినప్పుడు నిబంధనల పేరుతో వైద్య ఖర్చుల చెల్లింపును తగ్గించడం సరికాదని స్పష్టం చేసింది.
డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గుండె మార్పిడి చికిత్స కోసం అయిన పూర్తి ఖర్చును రీయింబర్స్ చేయాలని చండీగఢ్ యంత్రాంగాన్ని క్యాట్ ఆదేశించింది. అత్యవసర వైద్య పరిస్థితుల్లో చికిత్స పొందినప్పుడు ప్యాకేజీ ధరలను సాకుగా చూపి రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పరిమితం చేయకూడదని పేర్కొంది. ఇప్పటికే చెల్లించిన రూ.10 లక్షలను మినహాయించి, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!