
జనరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ20 పెట్రోల్ చీమలను ఆకర్షిస్తుందనే వాదనలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. చెరకు నుంచి తయారవుతుందని ఇది తీపిగా ఉంటుందని చెప్పడం పూర్తిగా తప్పని ఆయన స్పష్టం చేశారు. ఎథనాల్ ఒక ఆల్కహాల్ రూపమని, చీమలు దానిని ఆకర్షించవని తెలిపారు.
ఇలాంటి వాదనలు నిజమైతే విస్కీ, రమ్ వంటి పానీయాల వద్ద కూడా చీమలు చేరాల్సి ఉంటుందని గడ్కరీ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు నిజానిజాలు తెలుసుకుని మాత్రమే సమాచారం పంచుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!