
జనరల్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల శక్తి, సౌభాగ్యానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన తన సతీమణి జానకీ శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని గవర్నర్ ప్రార్థించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!