
సినిమాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. జనక్‌పురిలో అత్యధికంగా 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం.
భారీ వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తం 15 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!