26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

Writer: Chandrika 04:17 PM, 26 నవంబర్, 2026
సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

సైబరాబాద్ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు త్వరలో వన్‌వే విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రత్యేక బస్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ చర్యలు విజయవంతం కావాలంటే ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు సీఎంసీ, సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లండన్ ట్రాన్స్‌పోర్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ, బొగోటా మేయర్ ఎన్రికే పెనలోసా అతిథులుగా హాజరయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌తో పాటు ఐటీ ఉద్యోగులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను డీజీపీ, అతిథులు పరిశీలించారు.

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కూడళ్ల అభివృద్ధి కోసం సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, లివింగ్ ల్యాబ్స్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లలో సైబరాబాద్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో దాదాపు 80 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారని, దీంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని వివరించారు. సైబరాబాద్ పోలీసులు, సీఎంసీ అనేక చర్యలు చేపట్టినా సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ట్రాఫిక్ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను సూచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్విడియాలో మరో ప్రేమకథ..

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

ట్యాగ్లు
సైబరాబాద్ ట్రాఫిక్డీజీపీ సీవీ ఆనంద్సైబరాబాద్ మూవ్స్ 2026వన్‌వే విధానంప్రత్యేక బస్ లైన్లుహైదరాబాద్ ట్రాఫిక్సైబరాబాద్ పోలీసులుప్రజా రవాణాఐటీ కారిడార్ట్రాఫిక్ నియంత్రణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్
జనరల్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!
జనరల్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్
సినిమాలు

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
బిజినెస్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

ఎన్విడియాలో మరో ప్రేమకథ..
జనరల్

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!
సినిమాలు

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక
జనరల్

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్’..
రాజకీయాలు

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్’..

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
జనరల్

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు
జనరల్

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!