
షోస్

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. లోయలో పడిన బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!