

భారత్ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు సవాళ్లు ఎదురైన సందర్భాల్లో రష్యా చారిత్రకంగా అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్–రష్యా సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా వాణిజ్యం, ఇంధనం, అణు సహకారం, అంతరిక్షం, పెట్టుబడులు వంటి రంగాలకు విస్తరించాయని తెలిపారు. రష్యాపై భారత్ అభిప్రాయం తమ స్వంత చారిత్రక అనుభవం, జాతీయ ప్రయోజనాల ఆధారంగా ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. రక్షణ, అణు సహకారంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ వివరాలు కూడా సూచిస్తున్నాయి.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ.. కేవలం చర్చలు, దౌత్యం కోసం పిలుపునివ్వడానికే భారత్ పరిమితం కావడం లేదని జైశంకర్ అన్నారు. ఇరు పక్షాలతో నల్ల సముద్రంలో నౌకాయానం, ధాన్యం, ఇంధన ఎగుమతులు, పరస్పరం దాడులు చేయకూడదనే సాధ్యమైన ఏర్పాట్లపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. యుద్ధం కారణంగా నల్ల సముద్ర వాణిజ్యం, ఇంధన సరఫరాల్లో కొనసాగుతున్న అంతరాయాల నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!