

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ అభ్యున్నతి, ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ఇందిరా గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆమె జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా దినోత్సవం దేశ ప్రజలకు ఐక్యత, సమగ్రతపై గొప్ప సందేశాన్ని అందిస్తుందని సీఎం పేర్కొన్నారు.
కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భారతీయులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలమని, సమానత్వం, సోదరభావం, పరస్పర గౌరవం ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. దేశ ఐక్యతను కాపాడటం, ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఐక్యత, సమగ్రతతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!