11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 12:36 PM, 11 సెప్టెంబర్, 2026
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రూ.10 వేల ధరావతు మొత్తాన్ని హౌసింగ్‌ బోర్డు శుక్రవారం నుంచి తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. దరఖాస్తు సమయంలో ఒక్కో అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్‌గా చెల్లించారు. రెవెన్యూ, రవాణా, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హౌసింగ్‌ బోర్డు సమగ్రంగా పరిశీలన చేపట్టింది. 16 నియోజకవర్గాల నుంచి మొత్తం 60,720 దరఖాస్తులు రాగా.. తొలి దశ పరిశీలనలో సుమారు 40 వేల మందిని అనర్హులుగా గుర్తించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. వీరందరికీ వారు చెల్లించిన డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు.

ఎంపికైన లబ్ధిదారుల్లో పలువురు తమ దరఖాస్తుల్లో ఫోన్‌ నంబర్లను తప్పుగా నమోదు చేసినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఫోన్‌ నంబర్‌ మార్చుకునే అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు హౌసింగ్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంపికైన వారు దరఖాస్తు లేదా ఆధార్‌ నంబర్‌తో తమ అప్లికేషన్‌లోకి వెళ్లి అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. మరోవైపు ఎంపికైన కుటుంబాలపై క్షేత్రస్థాయి సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 5,500 కుటుంబాలను పరిశీలించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉండగా.. తుది నిర్ణయం అనంతరం జాబితాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. 16 నియోజకవర్గాల్లో ఆగస్టు 31న లాటరీ ప్రక్రియ పూర్తికాగా, ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపిక జాబితాను బుధవారం రాత్రి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు. లాటరీ సందర్భంగా స్థానికతపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు అదనపు పరిశీలన చేపట్టి, స్థానికతను నిర్ధారించిన అనంతరం జాబితాను అప్‌లోడ్‌ చేసినట్లు తెలిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు ఫోన్‌ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి...

ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు ఫోన్‌ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి...

ఉక్రెయిన్‌లో షాపింగ్ మాల్‌పై రష్యా దాడి

ఉక్రెయిన్‌లో షాపింగ్ మాల్‌పై రష్యా దాడి

ట్యాగ్లు
ఇందిరమ్మఇళ్లపథకంతెలంగాణహౌసింగ్‌బోర్డుఇందిరమ్మఇళ్లుతెలంగాణప్రభుత్వంగృహపథకందరఖాస్తుదారులవాపసురూ10వేలువాపసుహౌసింగ్‌బోర్డులబ్ధిదారులుతెలంగాణవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జనరల్

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం
జనరల్

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక
రాజకీయాలు

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు
బిజినెస్

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్
క్రీడలు

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌  రేసులో 8 మంది?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌ రేసులో 8 మంది?

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!