

వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించగా.. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కామెడీ, థ్రిల్, సస్పెన్స్, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెన్సార్ బోర్డు సూచనల మేరకు కొన్ని అభ్యంతరకర పదాలతో పాటు ప్రముఖుల పేర్లు, ఇంటి పేర్లను మ్యూట్ చేయాలని, కొన్ని హింసాత్మక సన్నివేశాల తీవ్రతను తగ్గించాలని చిత్ర బృందానికి సూచించినట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం 2 గంటల 29 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు సంభాషణలు అందించిన త్రివిక్రమ్.. తొలిసారిగా ఆయనకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!