

ప్రముఖ స్వర్ణాభరణాల రిటైల్ సంస్థ జోస్ అలుక్కాస్ దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా కస్టమర్లు ఆభరణాల కొనుగోలుపై పండుగ ప్రయోజనాలను పొందడంతోపాటు మొత్తం రూ.10 కోట్ల విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లు, ప్రత్యేక రివార్డులు నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఈ ఆఫర్లలో భాగంగా అర్హత కలిగిన బంగారం కొనుగోళ్లపై నిబంధనలు, షరతులకు లోబడి ఉచిత వెండిని పొందవచ్చు. అలాగే కియా సోనెట్ కార్లు, స్కూటర్లు, ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. బంగారు ఆభరణాల తయారీ చార్జీలపై 30 శాతం వరకు, వజ్రాభరణాలు, ప్లాటినం ఆభరణాలపై కూడా 30 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్లను వినియోగించుకునే ముందు సమీపంలోని జోస్ అలుక్కాస్ షోరూమ్‌లో వర్తించే నిబంధనలు, అర్హతలు, ఆఫర్ వివరాలను తెలుసుకోవాలని కస్టమర్లకు సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!