

కేరళంకు చెందిన ఓ పోలీస్ అధికారి అరుదైన ఘనత సాధించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘కేరళాథాన్’లో పాల్గొన్న శిజిత్.. కేవలం 14 రోజుల్లోనే రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలను కవర్ చేస్తూ మారథాన్‌ను పూర్తి చేశారు. ఈ ప్రయాణంలో ఆయన మొత్తం 590 కిలోమీటర్లు పరుగెత్తారు. ప్రతిరోజూ 40 కిలోమీటర్లకు పైగా పరుగెత్తుతూ.. ప్రతికూల వాతావరణం, శారీరక అలసట వంటి సవాళ్లను అధిగమించారు. చివరకు తిరువనంతపురంలో తన పరుగును విజయవంతంగా ముగించారు.
కాసర్‌గోడ్‌కు చెందిన శిజిత్ ఇపిట్టా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనది వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనం నుంచే తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడేవారు. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరుగుపందెంపై ఆసక్తి పెంచుకున్నారు. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎలాంటి పోటీల్లో పాల్గొనని ఆయన.. గత ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు పరుగుపందాల పోటీల్లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగితే సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి కఠినమైన మారథాన్‌లను పూర్తి చేయగలరని శిజిత్ అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!