

డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. దేశం నుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
ఈ ఉద్యమంలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుతో పాటు రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన కీలక కార్యక్రమమిదని అన్నారు. గత రెండు రోజులుగా ఈ యాత్రను గమనిస్తున్నానని, ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!