
జనరల్

మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి నుంచి మల్లేపల్లి వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు ప్రారంభమై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది.
రోడ్డుపై కంకర తేలడంతో పాటు వాహనాలు వెళ్లినప్పుడు భారీగా దుమ్ముధూళి లేస్తోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి పనులను వేగవంతం చేసి రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!