
క్రీడలు

16 ఏళ్లలోపు బాలబాలికలకు సోషల్ మీడియా వేదికల వినియోగాన్ని నియంత్రించేందుకు కెనడా ప్రభుత్వం డిజిటల్ సేఫ్టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. చిన్నారులకు మరింత సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని కల్పించడం, సోషల్ మీడియా వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.
కెనడా మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ, బాలల భద్రతే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అయితే, చిన్నారుల రక్షణకు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిరూపించే సోషల్ మీడియా సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. డిజిటల్ భద్రత విషయంలో కెనడా తీసుకుంటున్న కీలక చర్యగా ఈ బిల్లును భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!