
జనరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో ఈ భేటీ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిని మోదీ సమీక్షించనున్నారు. అలాగే, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయనే అంశంపైనా చర్చించనున్నారు. పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!