
సినిమాలు

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు సంప్రదాయ బాణసంచాకు బదులుగా హరిత బాణసంచా (గ్రీన్ క్రాకర్స్) మాత్రమే వినియోగించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సూచించింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పండుగ వేడుకల సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్‌ను వినియోగించాలని కోరింది.
నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పీసీబీ సభ్య కార్యదర్శి రాసిన లేఖ ఆధారంగా పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. విశాఖపట్నంలో కాలుష్య స్థాయులు పెరుగుతున్నాయని పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. దీపావళి వేడుకల సమయంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!