

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులనే ధరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు నుంచి కొత్త దుస్తుల విధానాన్ని అమలు చేయనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు శుక్రవారం ప్రకటించారు. ఆలయానికి వచ్చే భక్తులంతా ఈ నిబంధనను పాటించాలని కోరారు.
హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడంతో పాటు దైవం పట్ల భక్తిప్రపత్తులను చాటుకునేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు సూచించారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రధారణ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు మాట్లాడుతూ, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులంతా ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. ఆలయ మర్యాదలను అనుసరిస్తూ సంప్రదాయ దుస్తులతో దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!