
జనరల్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు వెలువడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌కు వెళ్తున్న ఈ బస్సు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఫరూఖ్‌నగర్ సమీపంలోని ఏ1 ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశారు. ప్రయాణికులను హెచ్చరించి అందరినీ సురక్షితంగా కిందకు దించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగా బస్సులో పొగలు వెలువడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!