
జనరల్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రక్ యార్డుకు చెందిన భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూములను వేలం వేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజాగా ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేసింది. దీంతో కూకట్‌పల్లి ట్రక్ యార్డు భూముల వేలానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఫలితంగా నేడు జరగాల్సిన 3.15 ఎకరాల భూముల వేలానికి మార్గం సుగమమైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!