31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..

Writer: Chandrika 06:50 AM, 31 ఆగస్టు, 2026
తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..

‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక, పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండస్ట్రియల్‌ పాలసీ 2.0’కు రూపకల్పన చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని విస్తరించడం, ఆధునిక సాంకేతికతలను రాష్ట్రానికి తీసుకురావడం, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడం, హైదరాబాద్‌తో పాటు జిల్లాలు, టైర్‌-2, టైర్‌-3 నగరాలను పారిశ్రామిక వృద్ధి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 10 కీలక రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే దావోస్‌ వేదికగా ‘నెక్స్ట్‌జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026-30’ను ప్రకటించగా.. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమిట్‌’లో మరో తొమ్మిది కొత్త విధానాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త పారిశ్రామిక విధానాల్లో కేవలం పెట్టుబడి విలువనే కాకుండా ఉపాధి కల్పన, తయారీ సామర్థ్యం, స్థానిక విలువ జోడింపు, ఎగుమతులు, పారిశ్రామిక ఎకోసిస్టమ్‌, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భారీ, మెగా పరిశ్రమలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు హైదరాబాద్‌ వెలుపల పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు అదనపు రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ, ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఫుట్‌వేర్‌, అప్పెరల్‌, జీసీసీలు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌, ఆటోమొబైల్‌ రంగాలకు ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్నారు. 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌-3 లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో తెలంగాణను ఒకటిగా నిలపడం, ఐదేళ్లలో 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించడం ‘నెక్స్ట్‌జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ’ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ‘ఐటీ పాలసీ 2.0’లో ఏఐ, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డీప్‌టెక్‌, ఫిన్‌టెక్‌, డిజిటల్‌ ఇంజినీరింగ్‌ వంటి భవిష్యత్‌ సాంకేతిక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్‌ పాలసీ ద్వారా సెమీకండక్టర్లు, చిప్‌ డిజైన్‌, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ తయారీని ప్రోత్సహించి తెలంగాణను ‘చైనా ప్లస్‌ వన్‌’ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పేస్‌టెక్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఉపాధి ఆధారిత తయారీ, జీసీసీలు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌, ఆటోమొబైల్‌ రంగాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీలు, ఆటో కాంపోనెంట్స్‌ తయారీ సంస్థలను ఆకర్షించడం ద్వారా తెలంగాణలో విస్తృత పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..

19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న భక్తి టీవీ..

19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న భక్తి టీవీ..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి నేటి జ్యోతిష్య ఫలితాలు ఇవే

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి నేటి జ్యోతిష్య ఫలితాలు ఇవే

ట్యాగ్లు
తెలంగాణ పారిశ్రామిక విధానంఇండస్ట్రియల్ పాలసీ 2.0తెలంగాణ రైజింగ్ 2047తెలంగాణ పెట్టుబడులుతయారీ రంగంలైఫ్ సైన్సెస్ పాలసీఐటీ పాలసీ 2.0ఎలక్ట్రానిక్స్ పాలసీఏరోస్పేస్ డిఫెన్స్ఆటోమొబైల్ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత
రాజకీయాలు

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..
జనరల్

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం
జనరల్

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

ఇంటి డౌన్‌ పేమెంట్‌ కోసం పీఎఫ్‌ డబ్బు వాడొచ్చా?
బిజినెస్

ఇంటి డౌన్‌ పేమెంట్‌ కోసం పీఎఫ్‌ డబ్బు వాడొచ్చా?

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...
జనరల్

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..
జనరల్

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ
సినిమాలు

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..
జనరల్

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..

19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న భక్తి టీవీ..
జనరల్

19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న భక్తి టీవీ..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి నేటి జ్యోతిష్య ఫలితాలు ఇవే
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి నేటి జ్యోతిష్య ఫలితాలు ఇవే

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌
గాసిప్స్

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!